Crime News: తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం.. అంతర్‌ జిల్లాల గజదొంగ అరెస్ట్‌

తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లాల గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 13 Nov 2023 18:11 IST

ఉండ్రాజవరం: తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లాల గజదొంగను తూ.గో జిల్లాలోని కొవ్వూరు, ఉండ్రాజవరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.23.80 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. గజదొంగ నవీన్ ప్రసాద్ మొత్తం 18 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసు వివరాలను మీడియాకు ఎస్పీ జగదీష్ వెల్లడించారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఇళ్లల్లో నవీన్‌ ప్రసాద్‌ దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని