Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. ఛార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. 

Updated : 11 Jun 2024 16:53 IST

హైదరాబాద్‌: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు. ఛార్జిషీట్‌లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. మరో వైపు అడిషినల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్‌ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్‌ మంజూరు చేయొద్దని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని