Crime news: ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి

ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది.

Updated : 23 May 2024 10:10 IST

కోడుమూరు పట్టణం: ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 మందికిపైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోనికి బయల్దేరింది. మార్గంమధ్యలో కోడుమూరు వద్దకు చేరుకోగానే మరో వాహనాన్ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది.

ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి (13), గోవర్ధిని (8) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని, ఘటనానంతరం అతడు పరారయ్యాడని బాధితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని