Phone tapping case: రాధాకిషన్‌రావు అరెస్టుపై కీలక ప్రకటన విడుదల చేసిన పోలీసులు

ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్‌ట్యాపింగ్‌లో పాల్గొన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అంగీకరించినట్లు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. 

Updated : 29 Mar 2024 23:52 IST

హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు సంబంధించి పోలీసులు ఈరోజు మీడియాకు కీలక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించాం. ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్‌ట్యాపింగ్‌లో పాల్గొన్నట్లు రాధాకిషన్‌రావు అంగీకరించారు. రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా రవాణా చేస్తున్న నగదు స్వాధీనంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసులో ఇతర నిందితులతో కుమ్మక్కై ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాక్ష్యాల ధ్వంసం, అదృశ్యం చేయడంలో సహకరించినట్లు రాధాకిషన్‌రావు అంగీకరించారు’’ అని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం న్యాయమూర్తి ఎదుట రాధాకిషన్‌రావును హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్ గూడా జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు