Hyderabad: ప్రీ లాంచ్ పేరుతో మోసం.. స్థిరాస్తి సంస్థ యజమాని అరెస్టు

ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 12 Feb 2024 23:16 IST

హైదరాబాద్‌: ప్రీ లాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న భువన తేజ స్థిరాస్తి సంస్థ యజమాని సుబ్రహ్మణ్యాన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో రూ.2.29 కోట్ల నగదును వసూలు చేసి కాజేసినట్లు గుర్తించారు. శామీర్‌పేట్‌ హ్యాపీ హోమ్స్ పేరుతో ప్లాట్లను విక్రయిస్తున్నానని బాధితుల నుంచి సేల్ డీడ్‌ల రూపంలో సుబ్రహ్మణ్యం నగదు వసూలు చేశాడు. ఇందులో దాదాపు 400 మంది బాధితులు ఉన్నారని పోలీసులు తేల్చారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని