Khammam: కుక్కను తప్పించబోయి కారు బోల్తా .. ఇద్దరు కుమార్తెలు సహా తల్లి దుర్మరణం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిసహా ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు.

Published : 28 May 2024 22:31 IST

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లితోపాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. బాబోజీ తండాకు చెందిన డాక్టర్ బోడ ప్రవీణ్ కుటుంబం హైదరాబాద్‌కి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  కుక్క అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీ కొట్టింది. మృతదేహాలను 108 అంబులెన్స్‌ ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు కేసి విచారణ జరుపుతున్నారు. ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుల బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని