ఏఓబీలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

మల్కాన్‌గిరి జిల్లా ఏవోబీ కటాఫ్‌ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్‌గూడా ఘాట్‌ రోడ్డులో టిప్పర్‌ బోల్తా పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 25 Nov 2023 15:23 IST

మల్కాన్‌గిరి: మల్కాన్‌గిరి జిల్లా ఏవోబీ కటాఫ్‌ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హంతల్‌గుడా ఘాట్‌ రోడ్డు వద్ద టిప్పర్‌ బోల్తా పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే శనివారం చిత్రకొండ నుంచి 16 మంది కూలీలు, సిమెంట్‌ బస్తాలు, ఇనుప రాడ్లు తీసుకొని ఓ టిప్పర్‌  హంతల్‌గుడా వైపు వెళ్తోంది. జోడాంబో ఠాణా హంతాల్‌గుడా ఘాట్‌రోడ్డు వద్ద టిప్పర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు క్షతగాత్రులను జోడాంబో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితులను నవరంగపూర్‌ జిల్లాకి చెందిన వారిగా గుర్తించారు. మల్కాన్‌గిరి జిల్లా ఎమ్‌.వి. 79 గ్రామానికి చెందిన పీకే స్వాయీ అనే గుత్తేదారు స్వాభిమాన్‌ ప్రదేశంలో వంతెన, రహదారి నిర్మాణ పనుల కోసం ఈ సిమెంట్‌ బస్తాలు, ఇనుపరాడ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని