Road Accident: ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

గుంటూరు జిల్లాలో ట్రాక్టర్‌-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

Updated : 01 Mar 2024 13:48 IST

గుంటూరు: ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు