Jadcherla: పాఠశాల బస్సును ఢీకొట్టిన లారీ.. 28 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం కొత్తతండా సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది.

Published : 09 Oct 2023 11:52 IST

జడ్చర్ల గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం కొత్తతండా సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 28 మంది విద్యార్థులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తోంది. కొత్త తండాలో పాఠశాలకు సమీపంలో ఓ మలుపు వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మంది విద్యార్థులను స్థానికులు మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల తెలిపారు. సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి రవీందర్‌, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని