Road Accident: నిర్మల్‌ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది.

Updated : 23 May 2024 01:58 IST

బోల్తా పడిన బస్సు

సారంగాపూర్, నిర్మల్, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం రాణాపూర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో సుమారు 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకుని ఆక్కడికి చేరుకున్న సారంగాపూర్‌ పెట్రోకార్‌ పోలీస్‌ సిబ్బంది కానిస్టేబుల్‌ మనోజ్, రాణాపూర్‌ గ్రామస్థులు క్షతగాత్రులను 108 వాహనాల్లో నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్‌ అజాగ్రత్తగా నడిపారని క్షతగాత్రులు చెప్పారు. బస్సు బోల్తాపడగానే డ్రైవర్‌ అక్కడి నుంచే పరారు అయినట్లు తెలిసింది.

ఫర్హాన బేగంను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న దృశ్యం

మహిళ పరిస్థితి విషమం: క్షతగాత్రుల్లో ఫర్హాన బేగం (25) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్‌ ఆసుపత్రి వైద్యుల సూచనలతో ఆమెను అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని