Kachiguda: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన.. హోంగార్డు అరెస్టు

యువతిపై అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడా రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

Published : 29 May 2024 20:39 IST

హైదరాబాద్‌: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఓ కుటుంబం తిరుపతి నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ వస్తోంది. ఈ క్రమంలో హోంగార్డు ప్రతాప్‌.. ఎస్‌-3 కోచ్‌లో నిద్రిస్తున్న యువతి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తండ్రి రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రైలు కాచిగూడ వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోడూరు పీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ప్రతాప్‌ యూనిఫామ్‌లో ఉండి టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు అని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని