Mahabubabad: పాఠశాల బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పాఠశాల నుంచి బయలుదేరిన బస్సు.. కేసముద్రం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది.

Updated : 24 Jul 2023 17:48 IST

కేసముద్రం: మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం మండలంలో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. పాఠశాల నుంచి బయలుదేరిన బస్సు.. కేసముద్రం క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు. బస్సు బోల్తా పడడం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను బస్సులో నుంచి బయటకు తీసి కాపాడారు. విద్యార్థులందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవర్‌ బస్సు నడిపాడని.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని