Crime News: రైల్వే విశ్రాంత అధికారి ఇంట్లో 17 కిలోల బంగారం

తూర్పు కోస్తా రైల్వేలో ఉద్యోగ విరమణ చేసిన అధికారి ఇంట్లో 17 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..

Updated : 18 Jan 2023 08:30 IST

స్వాధీనం చేసుకున్న సీబీఐ

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: తూర్పు కోస్తా రైల్వేలో ఉద్యోగ విరమణ చేసిన అధికారి ఇంట్లో 17 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. రైల్వేలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్‌ మేనేజర్‌గా 2022లో ఉద్యోగ విరమణ చేసిన ప్రమోద్‌ కుమార్‌ జెనా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఈ నెల 4న ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. భువనేశ్వర్‌, కటక్‌, జగత్సింగ్‌పుర్‌లలో జెనాకు ఆస్తులున్నట్లు గుర్తించారు. భువనేశ్వర్‌లోని ఆయన నివాసంలో 17 కిలోల బంగారాన్ని గుర్తించారు. అలాగే రూ.1.57 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో మరో రూ.2.50 కోట్లు ఉన్నట్లు తెలుస్తోందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని