ఘోర ప్రమాదం.. చెరువులో పడిన యాత్రికుల ట్రాక్టర్‌.. 15 మంది మృతి

హరిద్వార్‌ వెళ్తున్న యాత్రికుల ట్రాక్టర్‌ చెరువులో పడిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.

Updated : 24 Feb 2024 13:04 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులను తీసుకెళ్తున్న ఒక ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు. ఆ యాత్రికులంతా హరిద్వార్‌ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వారంతా హరిద్వార్‌ వెళ్తుండగా.. ట్రాక్టర్‌ అదుపుతప్పి చెరువులో బోల్తాపడింది. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి కొంతమందిని కాపాడారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని