Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి 18 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. 

Updated : 20 May 2024 16:56 IST

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ భారీ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.  స్థానికులు కొందరు అడవి నుంచి తెండు ఆకుల్ని సేకరించి పికప్ వాహనంలో తిరిగివస్తుండగా అదుపుతప్పి లోయలో పడింది. అప్పుడు అందులో 25 మంది వరకు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలేనని వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే ఛత్తీస్‌గఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌శర్మ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని