TS News: గొర్రెల స్కామ్‌.. మరికొందరి పాత్రపై అనుమానం!

గొర్రెల పంపిణీ స్కామ్‌లో నిందితుల మూడు రోజుల కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి.. అనంతరం చంచల్‌గూడా జైలుకు తరలించారు.

Published : 02 Mar 2024 22:01 IST

హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ స్కామ్‌లో నిందితుల మూడు రోజుల కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి.. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. విచారణలో వీరి నుంచి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.2.10 కోట్లు 10 మంది బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని గుర్తించారు. ఈ కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాకు చెందిన పశుసంవర్ధక శాఖలో కొందరు అధికారులను బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని