TSPSC: రాజశేఖర్‌ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు

బడంగ్‌పేటలోని ప్రవీణ్‌ ఇంట్లో నిన్న సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్నపత్రాలను సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది. 

Updated : 21 Mar 2023 19:57 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీకేజీ కేసులో పోలీసు కస్టడీలో నాలుగో రోజు సిట్‌ అధికారులు నిందితులను విచారించారు. ఇవాళ్టి దర్యాప్తులో పలు కీలక అధారాలను సిట్‌ అధికారులు సేకరించినట్టు సమాచారం. పరీక్ష రాసిన గోపాల్‌, నీలేష్‌కు నీలేష్ సోదరుడు రాజేంద్రనాయక్‌ డబ్బులు సమకూర్చినట్టు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్‌ శ్రీనివాస్‌ ద్వారా మరికొంత నగదు ఇప్పించినట్టు సమాచారం.

బడంగ్‌పేటలోని ప్రవీణ్‌ ఇంట్లో నిన్న సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండలోని రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో సోదాల సమయంలో మరికొన్ని ప్రశ్నపత్రాలను సిట్‌ బృందం స్వాధీనం చేసుకుంది. మార్చి 5న నీలేష్, గోపాల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్ష రాశారు. పేపర్‌ ఇచ్చినందుకు ఇద్దరు అభ్యర్థులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ ద్వారా రూ.14లక్షలు సమకూర్చినట్టు సిట్‌ అధికారులు గుర్తించినట్టు సమాచారం. నిందితురాలు రేణుకతో పాటు ఆరుగురిని హిమాయత్‌ నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇంకా సీసీఎస్‌ కార్యాలయంలోనే ఉన్నారు.

పేపర్ లీకేజీ వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ సిట్‌ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు ఫోన్‌లో మాట్లాడిన వారి చిరునామాలు సేకరించిన సిట్.. సంప్రదింపులు జరిపి అభ్యర్థుల ఇళ్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో వైపు నిందితుల వెనక ఎవరున్నారనే వివరాలు ఇంటెలిజెన్స్ పోలీసులు సేకరిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని  సిట్ కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ నుంచి తీసుకువచ్చిన కంప్యూటర్లను సైబర్ క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ఉగ్యోగులను సిట్‌ కార్యాలయానికి తీసుకొచ్చి సిట్‌ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకర్ లక్ష్మిని మరొకచోట సిట్  అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని