Software Engineer: విహారయాత్రకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విగతజీవిగా మారాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద చోటుచేసుకుంది. 

Updated : 13 Aug 2023 13:37 IST

చింతూరు: స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ విగతజీవిగా మారాడు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు జలపాతం వద్ద చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌(24) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం 15 మంది స్నేహితులతో కలిసి చింతూరు మండలంలోని పొల్లూరు జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లాడు. జలపాతం వద్ద నీటిలోకి దిగిన హేమంత్‌ ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని