Crime News: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ రవి ఆత్మహత్య

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 28 Dec 2023 12:21 IST

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దగ్గర పీఏగా పనిచేస్తున్న రవి (36) ఆత్మహత్య చేసుకున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న రవి.. ఎమ్మెల్యే తరఫున వచ్చే వీఐపీలకు తిరుమలలో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించేవాడు. అయితే ఉన్నట్టుండి రవి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణాలుగా అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని