Parvathipuram Manyam: సైకిల్‌పై వెళ్తుండగా ఫిట్స్‌.. చెరువులో పడి విద్యార్థిని మృతి

సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ (ఫిట్స్‌) రావడంతో చెరువులో పడి విద్యార్థిని మృతిచెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 18 Jul 2023 14:18 IST

సీతానగరం: సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ (ఫిట్స్‌) రావడంతో చెరువులో పడి విద్యార్థిని మృతిచెందింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలంలోని ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి(14) అనే విద్యార్థిని గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. 

ఎప్పటిలాగే మంగళవారం ఉదయం శ్రావణి సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. మార్గంమధ్యలో విద్యార్థినికి ఫిట్స్‌ వచ్చింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి జారిపడింది. గమనించిన మరో విద్యార్థి.. శ్రావణి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. స్థానికులు, కుటుంబసభ్యులు చెరువులోకి దిగి విద్యార్థినిని బయటకు తీశారు. అయితే అప్పటికే శ్రావణి మృతిచెందింది. విద్యార్థినిపై సైకిల్‌ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సత్యం, పార్వతి దంపతులకు శ్రావణి ఏకైక సంతానం. తమ కుమార్తె మృతితో వారు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని