Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష బలవన్మరణానికి పాల్పడింది.

Updated : 22 Feb 2024 23:33 IST

నిర్మల్‌: బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara IIIT)లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష బుధవారమే ఇంటి నుంచి ఆర్జీయూకేటీ క్యాంపస్‌కు వచ్చింది. ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. విద్యార్థిని గదిలో సూసైడ్‌ నోట్‌ ఉందని అధికారులు తెలిపారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం దేవురాపురం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని