బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 16 Apr 2024 11:17 IST

ముథోల్‌: బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని.. ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్‌లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికి ఉరేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ రాకేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని