Mahabubabad: ఏసీబీ వలలో మానుకోట సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా

లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు.

Published : 22 Mar 2024 20:16 IST

మహబూబాబాద్: లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్‌ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్‌ కోసం గజానికి రూ.200 లంచం ఇవ్వాలని రిజిస్ట్రార్‌ తస్లీమా డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పి గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తస్లీమాకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.19,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది దగ్గర ఉన్న రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని