Vijayawada: జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్‌

సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 18 Apr 2024 16:28 IST

విజయవాడ: సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపర్చారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.

మరో వైపు.. రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్‌ వేశారు. న్యాయవాది కమిషనర్‌ను నియమించాలని పేర్కొన్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కాలనీ వాసులు కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని