Tamil Nadu: భార్య ఫిర్యాదు.. మాజీ అదనపు డీజీపీ అరెస్టు

విడిగా ఉంటున్న భార్య ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్న కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్‌ దాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 May 2024 22:58 IST

చెన్నై: తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య బీలా వెంకటేశన్‌ ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బీలా వెంకటేశన్‌ ప్రస్తుతం విద్యుత్‌శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈనెల 18న రాజేశ్‌ తన అనుచరులతో కలిసి తయూర్‌ నగర శివారులోని తన ఇంటిలోకి దౌర్జన్యంగా చొరబడ్డారని, కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును దూషించారని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయన్ని అరెస్టు చేశారు.

మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. మాజీ ADGPకి మూడేళ్ల జైలు

కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఏఐఏడీఎంకే హయాంలో రాజేశ్‌ దాస్‌ అదనపు డీజీపీగా సేవలందించారు. ఆ సమయంలో దిగువస్థాయి మహిళా ఐపీఎస్‌ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో గతేడాది విల్లుపురం కోర్టు ఆయన్ని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం ఆయనకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కాగా, తాజాగా దౌర్జన్యం కేసులో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని