
Road Accident: ఓఆర్‌ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి
హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా తానేదార్‌పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 22న స్వగ్రామంలో వీరి కూతురి వివాహం జరిగింది. ఆ వేడుకలు ముగించుకొని వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్‌లోని తమ నివాసానికి నిన్న రాత్రి బయల్దేరారు. పెద్ద అంబర్‌పేట్ వద్దకు రాగానే వేణుగోపాల్ దంపతుల స్కార్పియో వాహనం మలుపు తీసుకుంటున్న టిప్పర్‌ను వెనక వైపు నుంచి ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.