Crime news: డీజీపీ ఫొటోతో వాట్సప్‌ డీపీ.. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు

తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు.

Updated : 21 May 2024 12:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ ఫొటోతో కేటుగాళ్లు సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫొటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సప్‌ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించేందుకు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్థాన్‌ కోడ్‌ +92తో వాట్సప్‌ కాల్‌ వచ్చినట్లు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని