Crime News: కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల అనుమానాస్పద మృతి

జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

Published : 19 May 2024 12:40 IST

కర్నూలు: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. తొలుత చెరువులో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని వారు గుర్తించారు. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనేది మిస్టరీగా మారింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్‌జెండర్లను తీసుకువచ్చి మృతదేహాలను గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని