Crime News: రెవెన్యూ అధికారులు మోసం చేశారని.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటు చేసుకుంది.

Updated : 23 Mar 2024 22:18 IST

ఒంటిమిట్ట: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావు(47) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి(41), కుమార్తె వినయ(17) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారమందుకున్న సీఐ పురుషోత్తమరాజు ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ లభించింది. మూడెకరాల పొలం అమ్ముదామని అనుకోగా రికార్డులు తారుమారు కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసి ఉంది. పొలం వేరే వాళ్ల పేరుతో రికార్డుల్లో ఉందని.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని, ఏమి చేయలేని స్థితిలో చనిపోతున్నట్లు వారు అందులో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని