TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు.. మరో ముగ్గురి అరెస్టు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు.

Published : 16 Aug 2023 15:59 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు నిందితులను అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులు ముగ్గురిని సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 99కి చేరింది. ప్రశ్నపత్రాల లీకేజీలో ఈ ముగ్గురు నిందితులు ప్రవీణ్‌కు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు మూడోసారి తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని