Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలోని తాళ్లరేపు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పెయింటర్లు మృతి చెందారు.

Updated : 13 Nov 2023 17:02 IST

తాళ్లరేవు: కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం లచ్చావారిపేట వద్ద ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు పెయింటర్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులను రత్తవారిపేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని