Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
ముంబయి రోడ్ల మీద ఓ యువకుడు విచ్చలవిడిగా ప్రవర్తించాడు. యువతులను బైక్‌పై కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా స్టంట్లు చేశాడు.
ముంబయి: నగరంలో రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నా ఆకతాయి యువత మాత్రం వికృత చేష్టలు మానుకోవట్లేదు. శ్రుతి మించిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా బైకులపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ముంబయి(Mumbai)లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఓ యువకుడు ముంబయి రోడ్ల మీద విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఇద్దరు యువతులను బైక్‌పై ముందు వెనక కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా స్టంట్లు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. ఆ ముగ్గురిలో ఏ ఒక్కరూ హెల్మెట్ ధరించకపోవడం కొసమెరుపు. నిందితుడితో పాటు ఇద్దరు యువతులపై ముంబయి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వారికి కేవలం జరిమానా విధించి వదిలేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘‘ఈ వీడియోలో ఉన్నవారిపై బీకేసీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని గుర్తించడానికి విచారణ చేపట్టారు. ఎవరికైనా వారి గురించి సమాచారం తెలిస్తే మమ్మల్ని నేరుగా కలిసి వివరాలు తెలియజేయండి’’ అని ట్విటర్ వేదికగా ముంబయి ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య
-
General News
Odisha Train Accident: రాజమహేంద్రవరం రావాల్సిన 21 మంది ప్రయాణికులు సురక్షితం
-
India News
Odisha Train Tragedy: విపత్తు వేళ మానవత్వం.. రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
-
General News
odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
-
India News
Trains Cancelled: ఒడిశా రైలు ప్రమాదం.. 43కుపైగా రైళ్లు రద్దు..
-
India News
Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!