Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Updated : 23 May 2024 18:49 IST

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌- బీజాపూర్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి గురువారం కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి  ప్రారంభమైన ఆపరేషన్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఏడాది పలుచోట్ల జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని