Taj Mahal: తాజ్‌ పర్యాటకుడిపై ఇనుపరాడ్లతో దాడి

తాజ్‌మహల్‌ అందాలను చూసేందుకు దిల్లీ నుంచి వెళ్లిన ఓ పర్యాటకుడిపై అక్కడి యువకులు కొందరు ఇనుప రాడ్లతో దాడి చేసి చేదు అనుభవం మిగిల్చారు.

Updated : 19 Jul 2023 08:42 IST

తాజ్‌మహల్‌ అందాలను చూసేందుకు దిల్లీ నుంచి వెళ్లిన ఓ పర్యాటకుడిపై అక్కడి యువకులు కొందరు ఇనుప రాడ్లతో దాడి చేసి చేదు అనుభవం మిగిల్చారు. ఆదివారం నాటి ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అతడు ఓ మిఠాయిల దుకాణంలోకి వెళ్లగా.. వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితగ్గొట్టారు. పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఆ పర్యాటకుడు బసాయ్‌చౌకి - తాజ్‌గంజ్‌ మార్గంలో కారులో వెళ్తుండగా.. పక్కన నడిచి వెళుతున్నవారిలో ఒకరిని కారు తాకింది. పర్యాటకుడు కారు ఆపి.. వాళ్లకు క్షమాపణలు చెప్పారు. అయినా వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ ఇలా దాడికి దిగారు. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారని, వాళ్లకూ ఇలాంటి పరిస్థితులే ఎదురైతే దేశం పరువు పోతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు