Crime: కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి

కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.

Updated : 18 May 2024 21:01 IST

రావులపాలెం: కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారు. రావులపాలెంనకు చెందిన ఐదుగురు యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఒకరు ఒడ్డున ఉండగా.. మిగిలిన నలుగురు గోదావరిలో దిగారు. ఈశ్వర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, జయకుమార్‌లు గల్లంతయ్యారు. రాజేష్‌కు ఈత రావడంతో బయటపడ్డాడు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా.. సంపత్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని