Repalle: రేపల్లె సమీపంలో ట్రాక్టరు బోల్తా.. 20 మందికి గాయాలు

బాపట్ల జిల్లా రేపల్లె మండలం చాట్రగడ్డ శివారులో ట్రాక్టరు బోల్తాపడి 20 మందికి గాయలయ్యాయి.

Published : 24 May 2024 20:35 IST

రేపల్లె అర్బన్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం చాట్రగడ్డ శివారులో ట్రాక్టరు బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. నగరం మండలం ఉయ్యూరువారిపాలెం గ్రామ దేవర కొలువుల నేపథ్యంలో రేపల్లె మండలం, కొల్లిపర మండలం దావులూరుకు చెందిన ఉయ్యూరు వంశీయులు మోర్తోట వెళ్లారు.

అక్కడి నుంచి తిరిగి దావులూరు వెళ్తుండగా.. ట్రాక్టరు చాట్రగడ్డ శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. స్థానికులు 108 వాహనాల సహాయంతో క్షతగాత్రులను రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంకటేశ్వరమ్మ, వీరవెంకటరత్నం, వెంకట్రావు, గోపికృష్ణ, శ్రీహరి, సావిత్రి, వెంకటేశ్వరావు, భవాని, సాంబశివరావు, వెంకటలక్ష్మి, మల్లేశ్వరిలను తెనాలి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా, మరో ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు వైద్యశాలకు చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని