అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన

అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు మోసం చేసింది.

Published : 20 May 2024 14:19 IST

హైదరాబాద్‌: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు