Uttar pradesh : తాగుబోతుకు 38 చెప్పుదెబ్బలు.. యూపీ పోలీసు సస్పెన్షన్‌

యూపీలోని ఓ (Uttar pradesh) మార్కెట్లో వీరంగం సృష్టిస్తున్న తాగుబోతును పోలీసు 38 సార్లు చెప్పుతో కొట్టాడు. దాంతో ఉన్నతాధికారులు పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Published : 24 Jul 2023 01:37 IST

Image : Up police

లఖ్‌నవూ : ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడనే నెపంతో ఓ తాగుబోతును సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఓ పోలీసు 38 సార్లు చెప్పుతో కొట్టాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar pradesh) హర్దోయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దినేశ్‌ అనే పోలీసు సివిల్‌ డ్రెస్‌లో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లాడు. ఓ వ్యక్తి తప్పతాగి ఆ పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాడనే విషయం అతడి దృష్టికి వచ్చింది. తాగుబోతును వారించే ప్రయత్నం చేయగా.. దినేశ్‌పైనే తిరగబడ్డాడు. దాంతో ఆగ్రహించిన పోలీస్‌ తన చెప్పు తీసుకొని అదే పనిగా 38 సార్లు కొట్టాడు.

ఈ ఘటనపై అదనపు ఎస్పీ దుర్గేశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. కానిస్టేబుల్‌ సివిల్‌ దుస్తుల్లో సమీపంలోని మార్కెట్‌కు వెళ్లాడు. ఓ వ్యక్తి ఫూటుగా మద్యం తాగి ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గమనించాడు. అతడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ పైనా తిరగబడ్డాడు. దాంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో దూకుడు ప్రదర్శించిన పోలీసును వెంటనే సస్పెండ్ చేశామని’ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని