Palnadu: జనసేన నేతల వాహనంపై రాళ్లదాడి

పల్నాడు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

Updated : 22 Mar 2024 10:28 IST

మాచర్ల గ్రామీణం: పల్నాడు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో జనసేన నాయకులపై దాడి జరిగింది. మాచర్ల నుంచి స్వగ్రామం మించాలపాడుకు వెళ్తున్న వారి వాహనాన్ని జంగమహేశ్వరపాడుకు చెందిన వైకాపా నేతలు వెంబడించి రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జనసేన నాయకులు పసుపులేటి ప్రసాద్‌, సింగంసెట్టి మధు, పసుపులేటి హనుమంతరావు, దాసరి చెన్నయ్యకు గాయాలయ్యాయి. పల్నాడు జిల్లాలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై గురువారం ఎస్పీని ఈసీ వివరణ కోరింది. ఆ మరుసటిరోజే మళ్లీ వైకాపా నాయకులు దాడులకు దిగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని