Andhra News: వాషింగ్ మెషిన్ వృథా నీటిపై వివాదం.. ఘర్షణలో మహిళ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)లో దారుణం చోటుచేసుకుంది. వాషింగ్‌ మెషిన్‌ (Washing machine) నుంచి వెళుతున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ నివాసముంటున్నారు.

Updated : 07 Dec 2022 06:49 IST

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)లో దారుణం చోటుచేసుకుంది. వాషింగ్‌ మెషిన్‌ (Washing machine) నుంచి వెళుతున్న వృథా నీటి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణంలోని మశానంపేటలో పద్మావతి అనే మహిళ నివాసముంటున్నారు. ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్‌ ఇంటి ముందుకు వెళ్లింది. 

ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వేమన్న నాయక్‌ కుటుంబసభ్యులు పద్మావతిపై బండరాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే పద్మావతి మృతిచెందారు. ఈ ఘటనపై కదిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని