Hyderabad: కూకట్‌పల్లిలో అమానవీయ ఘటన.. మహిళపై హత్యాచారం?

కూకట్‌పల్లిలో ఓ మహిళపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Published : 21 Apr 2024 15:56 IST

కూకట్‌పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. వర్క్‌షాప్‌ సెల్లార్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇద్దరు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం చంపేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. దాదాపు 45 ఏళ్లు ఉండొచ్చని అంచనా. ఆదివారం ఉదయమే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని