logo

అసంపూర్తి పనులు.. ప్రజలకు అవస్థలు

నగరంలో ప్రధాన డ్రెయిన్లపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. రిటైనింగ్‌ వాల్స్‌ లేకపోవడం, ఉన్నవి దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Published : 26 May 2024 05:19 IST

ఈడేపల్లి శక్తి గుడి వద్ద పూర్తికాని రిటైనింగ్‌ వాల్‌

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలో ప్రధాన డ్రెయిన్లపై నిర్మించిన కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. రిటైనింగ్‌ వాల్స్‌ లేకపోవడం, ఉన్నవి దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సమస్యను అనేక సార్లు పాలకులు, అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదాలు జరిగినప్పుడు ఇదిగో సమస్య పరిష్కరిస్తామని చెప్పడమే కానీ తరువాత  పట్టించుకోకపోవడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ పరిస్థితి

  • శక్తి ఆలయం ప్రాంతంలో ప్రధాన డ్రెయిన్‌కు రిటైనింగ్‌ వాల్‌ అసంపూర్తిగా వదిలేశారు. ఆ పక్కనే నిర్మించిన గోడ కూడా పగిలిపోయింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. 
  • స్టాండ్‌ వెనుక నుంచి ఈడేపల్లి వెళ్లే దారిలోని డ్రెయిన్‌పై కల్వర్టు నిర్మించారు. రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మించకుండా వదిలేశారు. రాత్రి వేళ ఒక్కోసారి వాహనదారులు డ్రెయిన్‌లోకి వెళ్లిపోతున్నారని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు.
  • బైపాస్‌ రోడ్డు నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే రహదారి పక్కన ప్రధాన డ్రెయిన్‌ వద్ద కల్వర్టులు కుంగిపోవడంతో పాటు రహదారి కూడా కోతకు గురైంది. పరాసుపేట, చిలకలపూడి, సర్కిల్‌పేట, ఉల్లింగిపాలెం తదితర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 
  • అధికారులు, పాలకులు పట్టించుకుంటే తక్కువ నిధులతోనే సమస్య పరిష్కరించవచ్చు. కానీ ఆ దిశగా ఎవరూ చొరవ తీసుకోకపోవడంతో ప్రజలు ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సిన  దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బైపాస్‌ రోడ్డు నుంచి పెట్రోల్‌ బంకు పక్క నుంచి కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే దారిలో ప్రమాదకరంగా 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని