logo

వైకాపా జడ్పీటీసీ సభ్యుడి రెస్టారెంట్లో జూదం

జూద శిబిరం జరుగుతున్న హోటల్‌ నిర్వాహకుడైన తిరువూరు జడ్పీటీసీ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 27 May 2024 04:10 IST

పోలీసుల దాడి : 14 మంది అరెస్టు

తిరువూరు, న్యూస్‌టుడే: జూద శిబిరం జరుగుతున్న హోటల్‌ నిర్వాహకుడైన తిరువూరు జడ్పీటీసీ సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు పట్టణ సమీపంలోని ఆర్‌కే రెస్టారెంటులో జూద శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై జీవీవీ సత్యనారాయణ సిబ్బందితో కలిసి శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. జూదం ఆడుతున్న 13 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.30 వేల నగదు, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 13 మందితోపాటు రెస్టారెంట్‌ నిర్వాహకుడైన వైకాపా తిరువూరు జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని