logo

మున్సిపల్‌ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేయాలి

మున్సిపల్‌ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేసి పాత పద్ధతిలోనే హాజరు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండు చేశారు.

Published : 27 Jan 2023 04:33 IST

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఏఐటీయూసీ నాయకులు రాజారెడ్డి, రాజేష్‌ తదితరులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికులకు ముఖ హాజరు రద్దు చేసి పాత పద్ధతిలోనే హాజరు వేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండు చేశారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం అనంతపురంలో అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసే కార్యక్రమం చేపట్టారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థను మున్సిపల్‌ పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌, కార్మికులు కూడా వారి మొబైళ్ల నుంచి ప్రతిరోజు నాలుగు దఫాలు లొకేషన్లలో హాజరు తీసుకోవాలని, ఇప్పటికే చాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో కమిషనర్లు కార్మికులకు హుకుం జారీ చేస్తున్నారన్నారు. నిరక్షరాస్యులు, సెల్‌ఫోన్‌ వాడకం తెలియని కార్మికులు తమ మస్టర్‌ పడుతుందో లేదోనని భయాందోళనలో ఉన్నారన్నారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 28న మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30న కలెక్టరేట్‌ ఎదుట, ఫిబ్రవరి 8న మున్సిపల్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయం ముట్టడి, 15న టూల్‌డౌన్‌ చేపడతామని వారు హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌గౌడ్‌, ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, వేణుగోపాల్‌, నాగరాజు, నాగేంద్రబాబు, శివకృష్ణ, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని