logo

రేషన్‌ పంపిణీకి నేడు ఆఖరు

శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు.

Published : 18 May 2024 04:02 IST

63,421 మందికి అందని సరకులు 

పుట్టపర్తి, న్యూస్‌టుడే : శ్రీసత్యసాయి జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీపై ఎన్నికల ప్రభావం పడింది. ఈ నెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారం తదితర కారాణాల వల్ల కార్డుదారులకు సరకులు అందలేదు. శనివారంతో గడువు ముగుస్తున్నప్పటికీ సరకులు అందుకోవాల్సిన కార్దుదారులు ఇంకా వేలాది మంది జిల్లాలో ఉన్నారు. ఈ ఒక్క రోజులో లబ్ధిదారులందరికీ రేషన్‌ అందే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా 5,72,684 మంది కార్డుదారులున్నారు. ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీ వరకు కార్డుదారులకు సరకులు పంపిణీ చేస్తారు. మే నెల ఎన్నికల ప్రభావంతో పంపిణీ పక్రియ నత్తనడకన సాగింది. శుక్రవారం నాటికి 5,09,263 మంది కార్డుదారులకు సరకులు పంపిణీ చేశారు. ఇంకా 63,421 మంది పంపిణీకి నోచుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 89 శాతం పంపిణీ పూర్తి చేశారు. ఈ నెల 13న పోలింగ్‌ రోజున పంపిణీ నిలిపివేశారు. శనివారంతో పంపిణీ గడువు ముగియనుంది. పంపిణీ గడువు పెంచకపోతే వేలాది మంది పేదలు రేషన్‌ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం వరకు కార్డుదారులకు సరకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌరసరఫరాల అధికారి వంశీకృష్ణారెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని