logo

జగన్‌, మంత్రి పెద్దిరెడ్డికి ఇవే చివరి ఎన్నికలు: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

వైకాపా పాలనపై ప్రజల తిరుగుబాటు చూస్తుంటే ఈ ఎన్నికలే సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డికి ఇవే చివరి ఎన్నికలవుతాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు.

Updated : 13 Apr 2024 06:58 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి

పలమనేరు, న్యూస్‌టుడే: వైకాపా పాలనపై ప్రజల తిరుగుబాటు చూస్తుంటే ఈ ఎన్నికలే సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డికి ఇవే చివరి ఎన్నికలవుతాయని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని పెగరగుంట గ్రామంలో విలేకర్లతో మాట్లాడారు. పెద్దపంజాణి మండలంలో పెద్దిరెడ్డి తనపై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. పుంగనూరు నియోజకవర్గానికి నేను ఏమీ చేయలేదంటున్నారని ఇప్పుడు ఆయన వేస్తున్న రోడ్లన్నీ గత ప్రభుత్వంలో ఈఏపీ కింద నారా లోకేశ్‌ పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చినవేనని గుర్తు చేశారు. కల్లుపల్లె- చౌడేపల్లె రోడ్డు, పుంగమ్మ చెరువు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చెరువులో చెరువు కట్టి అభివృద్ధి అంటున్న పెద్దిరెడ్డిని చూసి జనం నవ్వుకుంటున్నారని విమర్శించారు. మీరు మాట్లాడే భాష సరైనదేనా ఒకసారి చూసుకోండి.. దరిద్రుడు అని సంబోధించడం మీ వయసుకు తగునా.. అష్ట దరిద్రుడు అని నేను సంభోదించగలను.. విజ్ఞత అడ్డొచ్చి మాట్లాడలేకున్నా.. పుంగనూరు ప్రజలు సిద్దంగా ఉన్నారు.. మిమ్మల్ని ప్యాక్‌ చేసి వెనక్కి పంపడానికి. అక్కడ చూసుకోండి.. అని హితవు పలికారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని