logo

కాటన్‌ కట్టడం.. అంతులేని అలక్ష్యం

కొత్తగా నిర్మించిన కట్టడాలు ఎలానూ లేవు.  భావితరాలకు స్ఫూర్తి పంచే పురాతన సౌథాలను పరిరక్షించే విషయంలోనూ వైకాపా సర్కారు నిర్లక్ష్యమే చూపింది. పి.గన్నవరం వద్ద సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన అక్విడక్టు ఇందుకు ఉదాహరణ.

Published : 26 May 2024 03:08 IST

1852లో... పి.గన్నవరం వద్ద కాటన్‌ నిర్మించిన అక్విడక్టు..

కొత్తగా నిర్మించిన కట్టడాలు ఎలానూ లేవు.  భావితరాలకు స్ఫూర్తి పంచే పురాతన సౌథాలను పరిరక్షించే విషయంలోనూ వైకాపా సర్కారు నిర్లక్ష్యమే చూపింది. పి.గన్నవరం వద్ద సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన అక్విడక్టు ఇందుకు ఉదాహరణ. 1852లో కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రూ.1,68,935 వ్యయంతో 694 మీటర్ల పొడవున కాటన్‌ దీనిని నిర్మించారు. దీని ద్వారా రాజోలు దీవిలోకి 600 క్యూసెక్కుల నీరు ప్రవహించి 33 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. 150 ఏళ్ల పాటు ఈ కట్టడం సేవలందించింది. దీనిపై భారం లేకుండా ఆ తర్వాత తెదేపా ప్రభుత్వం మరో నూతన అక్విడక్టు నిర్మించింది. కాటన్‌ నిర్మించిన కట్టడాన్ని ఓ చిహ్నం మాదిరి, అటు పర్యాటక ఆకర్షణగానూ తీర్చిదిద్దాల్సి ఉన్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. జలవనరులశాఖ డీఈఈ కె.వెంకటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా నిర్వహణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించ Ÿలేదన్నారు.

న్యూస్‌టుడే, పి.గన్నవరం

నిర్వహణ లేక అక్విడక్టు వద్ద మొలిచిన దుబ్బులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని