logo

54 మంది వాలంటీర్ల రాజీనామా

మండల వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో రాజ్‌మనోజ్‌ మంగళవారం వివరించారు.

Published : 03 Apr 2024 02:50 IST

కడియం ఎంపీడీవో రాజ్‌మనోజ్‌కు  రాజీనామా లేఖలను సమర్పిస్తున్న వాలంటీర్లు

కడియం, న్యూస్‌టుడే: మండల వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో రాజ్‌మనోజ్‌ మంగళవారం వివరించారు. పలు గ్రామాలకు చెందిన సుమారు 54 మంది తమ రాజీనామా లేఖలను ఇచ్చారన్నారు. వీరిలో కొందరు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నామని లేఖల్లో ప్రస్తావించినట్లు చెప్పారు.

అనుచిత వ్యాఖ్యలపై కేసు

నల్లజర్ల: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాలంటీర్‌పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లజర్ల మండలంలోని కవులూరు గ్రామ సచివాలయం వాలంటీర్‌ జాలాది శ్రీనివాస్‌ తన చరవాణీలో ఉన్న మీ వాలంటీర్‌ శ్రీనివాస్‌ వాట్సప్‌ గ్రూపులో మాజీ సీఎం చంద్రబాబును ఉద్ధేశించి ‘వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు, వితంతువులకు ఫించన్లు ఆపగలిగావు, దాని పర్యవసానం అనుభవిస్తావు’ అనే పోస్ట్‌ పెట్టారు. దీనిని ఓ వ్యక్తి తన సి-విజిల్‌ ఐడీ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫ్లయింగ్‌ స్వాడ్‌ టీం దీనిని గుర్తించి ఎంపీడీవో నరేష్‌కుమార్‌కు తెలియజేసింది. ఆయన ఫిర్యాదు మేరకు వాలంటీర్‌పై ఐపీసీ 188, 123, 134 సెక్షన్ల కింద నల్లజర్ల ఎస్సై వెంకట సురేష్‌ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని