ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్‌ చేసిన పోలీసులు

గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల  చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Updated : 02 May 2024 09:23 IST

గోపాలపురం: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాలసురేష్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని