logo

పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు.

Updated : 17 May 2024 07:27 IST

నక్కా ఆనందబాబుకు నోటీసులు అందజేస్తున్న అరండల్‌పేట సీˆఐ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: పల్నాడులో ఘర్షణలకు కారణమైన పిన్నెల్లి సోదరుల్ని జైలుకు పంపి శాంతి, భద్రతలు కాపాడాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు. మాచర్లకు వెళ్లకుండా ఆయనకు పోలీసులు గురువారం నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. ఆనందబాబు మాట్లాడుతూ ‘మాచర్లలో జరుగుతున్న హింసను అదుపు చేయడం చేతగాని పోలీసులు కొందరు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. కారంపూడిలో మూడు గంటలకు పైగా మృగాల్లా స్వైర విహారం చేశారు. వైకాపా నేతలకు కోవర్టులుగా పోలీసులు సహకరించి గొడవలకు పరోక్షంగా కారణమయ్యారు. అంతా అయిపోయాక 144 సెక్షన్‌ పెట్టాం. అదుపులోకి వచ్చిందని చెప్పడం సిగ్గుమాలిన చర్య. అయిదేళ్లుగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపపడం, దాడులు చేయడం వంటి అనాగరిక పనులకు పాల్పడ్డారు. ఇకనైనా అటుంటి వాటికి స్వస్తి పలకాలి. మాచర్లలో హింసను ప్రేరేపిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడిపై తక్షణమే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి’.. అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని